YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

జింకలను వేటాడిన ముఠా ఆరెస్టు

జింకలను వేటాడిన ముఠా ఆరెస్టు

అనంతపురం
జింకల వేటగాళ్లపై పోలీసులు దాడి చేసి పట్టుకున్న ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టాలపల్లి వద్ద చోటుచేసుకుంది.  రాత్రి పూట జింకలను వేటాడి పట్టుకుని వాటి మాంసాన్ని విక్రయిస్తున్న ముఠాను ఉరవకొండ సీఐ శేఖర్ ,ఫారెస్ట్ ఆధికారులు సంయుక్తంగా దాడులు చేసి అరెస్టు చేశారు. గుంతకల్లుకు చెందిన సికారి దేవరాజు,సికారి అర్జున్ ,సికారి రాము,సికారి నరసింహుల నలుగురు ముఠాగా ఏర్పడి కొంత కాలంగా జింకలను వేటాడుతూ వివిధ గ్రామాలతో పాటు పలు పట్టణాల్లో వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు.
మంగళవారం రాత్రిఉ విడపనకల్లు మండలం కొట్టాలపల్లి ప్రాంతంలో జింకలను వదించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో సీఐ శేఖర్,పారెస్ట్ ఆధికారులు ఆధ్వర్యంలో ఆ ముఠాపై దాడులు చేసి జింక మాంసాన్ని ,నాలుగు జింక చర్మాలను స్వాధీనం చేసుకుని ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేశారు.

Related Posts