YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జగ్గారెడ్డిని లైట్ తీసుకుంటున్న రేవంత్

జగ్గారెడ్డిని లైట్ తీసుకుంటున్న రేవంత్

హైదరాబాద్, డిసెంబర్ 29,
పి‌సి‌సి చీఫ్ రేవంత్ రెడ్డికి అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేయాలో లేక సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాలో తెలియని పరిస్తితి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాగోలా పార్టీని పికప్ చేయడానికి రేవంత్ కష్టపడుతున్నారు. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా పార్టీని పెట్టాలని చూస్తున్నారు. అలాగే మరోవైపు బలపడుతున్న బీజేపీని రేసులో వెనక్కి నెట్టి ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలా ప్రత్యర్ధి పార్టీలపై ఫైట్ చేస్తున్న రేవంత్‌ని సొంత పార్టీ నేతలే కిందకు లాగే పరిస్తితి కనిపిస్తోంది.ఇప్పటికే పలువురు సీనియర్లు రేవంత్‌ వెనుక గోతులు తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఆయనని ఎలాగైనా సైడ్ చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. పైకి రేవంత్‌కు సపోర్ట్‌గా ఉన్నట్లే కనిపిస్తున్నారు గానీ…వెనుక మాత్రం దెబ్బకొట్టేలా పనిచేస్తున్నారు. దీని వల్ల కాంగ్రెస్‌కే పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా రేవంత్‌ని టార్గెట్ చేసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎప్పటికప్పుడు రాజకీయం నడుపుతూనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు రేవంత్‌పై జగ్గారెడ్డి విమర్శలు చేశారుతాజాగా కూడా రేవంత్…కేసెయర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడితో అది ముగిసింది. కానీ మధ్యలో జగ్గారెడ్డి మాత్రం…తనని రచ్చబండకు పిలవలేదని, అసలు పార్టీలో నాయకులని రేవంత్ కలుపుకుని వెళ్ళడం లేదని, ఏకపక్షంగా ముందుకెళుతున్నారని, రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మార్చండి లేదా కొత్త పీసిసి అధ్యక్షుడిని నియమించండంటూ ఏకంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాసారు.ఇంత సీరియస్‌గా జగ్గారెడ్డి లేఖ రాస్తే..ఆ అంశాన్ని రేవంత్ చాలా లైట్ తీసుకున్నారు. మళ్ళీ జగ్గారెడ్డి మామూలు అయిపోతారని ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అయినా ఆ కార్యక్రమం సిద్ధిపేట జిల్లాలో జరిగేది అని జగ్గారెడ్డిది సంగారెడ్డి జిల్లా అని, ఆ అంశాన్ని రేవంత్ లైట్ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇలాగే లైట్ తీసుకుంటే, ఏ కార్యక్రమం చేసిన సొంత పార్టీ నేతలే అడ్డుకునే పరిస్తితి ఉంటుంది. దీని వల్ల జనంలో కాంగ్రెస్ మరింత తక్కువయ్యే పరిస్తితి ఉంటుంది.

Related Posts