అమరావతి
జగనన్న పాల వెల్లులువ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి బుధవారం నాడు కృష్ణాజిల్లా లో లాంఛనంగా ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించగా, రెడ్డిగూడెం గ్రామ సచివాలయం లో వర్చవల్ విధానం ద్వార ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు, జాయింట్ కలెక్టర్ మాదవీలత, యంపిపి రామినేని దేవి ప్రవణ్య, సర్పంచ్ మల్లాది రాణి, పాలంకీ మురళి మోహన రెడ్డి, , స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మహిళలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగనన్న పాల వెల్లువ పధకం గురించి మహిళల అభిప్రాయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వారిని అభినందించారు. పాడి రైతులను మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకువెళ్ళేందుకు అమూల్ సంస్థ తో ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్బంగా సియం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ 'కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది చారిత్రాత్మక ఘట్టం. జిల్లాలో రైతులు, అక్కాచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభిస్తుంది. ఇప్పటికే ఐదు జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. అమూల్ సంస్థ ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైఎస్సార్ జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 174, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 148.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. పాడి రైతులకు దాదాపు రూ.71 కోట్లు చెల్లించారు. ఇతర డైరీలతో పోల్చితే అమూల్ పది కోట్లు అదనంగా ఇచ్చిందని అయన వెల్లడించారు. .