YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మైనర్ బాలికతో రెండో పెళ్లి భర్త దుకాణం ముదు మొదటి భార్య ధర్నా

మైనర్ బాలికతో రెండో పెళ్లి భర్త దుకాణం ముదు మొదటి భార్య ధర్నా

నెల్లూరు
భర్త తనని మోసం చేసి మైనర్ అమ్మాయితో వెళ్ళి పోయాడని   కోటలో ఒక మహిళ పిల్లలతో సహా భర్త కు చెందిన బట్టల దుకాణం ముందు ధర్నాకు దిగింది. భర్త ఫోటో వున్న ఫ్లెక్సెని చెప్పుతో కొట్టి నిరసన తెలిపింది. గూడూరుకు చెందిన తస్లీమా అనే మహిళకు 10 సంత్సరాల క్రితం కోటకు చెందిన కరిముల్లా అనే వ్యక్తితో వివాహం జరిగింది, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ,కరిముల్లా కోటలో బట్టల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. గత కొన్ని రోజులు గా కరిముల్లా ప్రవర్తనలో తేడా వచ్చింది. భార్య తస్లీమాని వేదించడం మొదలు పెట్టాడు.  ఒక మైనర్ అమ్మాయి తో కలిసి తిరగడం, ఆ అమ్మాయి కి బంగారు, ఇళ్ల స్థలం రాసిచ్చినట్టు భార్యకు తెలిసింది. దీంతో తస్లీమా నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వగా ఇక మీదట భార్యను బాగా చూసుకుంటానని చెప్పిన కరిముల్లా వారం తిరగక ముందే మాయమయిపోయాడు. తన భర్త కరిముల్లా ఆ మైనర్ అమ్మాయి ని తీసుకుని వెళ్ళి పోయినట్టు తస్లీమా గుర్తించింది. తన బిడ్డని కుటుంబసభ్యులను తీసుకుని కోటలో తన భర్త కు చెందిన బట్టల దుకాణం ముందు ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని ధర్నాకు దిగింది. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పింది. తనకు విడాకులు ఇవ్వకుండానే భర్త కరిముల్లా మైనర్ బాలికతో వెళ్లిపోవడానికి మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కొందరు సహకరించారని వీరందరినీ కూడా శిక్షించాలని ఆమె కోరింది.  తనకి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు....

Related Posts