హైదరాబాద్, డిసెంబర్ 29,
2022 సంక్రాంతికి విడుదల కానున్న పాన్ ఇండియా సినిమాలకు ఇది కష్ట సమయం. పెరుగుతున్న కోవిడ్, ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి కొన్ని బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ, ఈ రోజు ఢిల్లీలోని థియేటర్లను తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు అక్కడ. మరోవైపు మహారాష్ట్రలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50% ఆక్యుపెన్సీతో ఆంక్షలు నడుస్తున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద చిత్రాలకు ఇది భారీ దెబ్బ అని చెప్పొచ్చు.ఈ శుక్రవారం విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ ఈ ఢిల్లీ నిర్ణయం వెలువడగానే విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ కారణంగా ఇప్పటికే ముంబైలోని థియేటర్లు సెకండ్ షోను ప్రదర్శించడం లేదు. అందుబాటులో ఉన్న థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా టిక్కెట్ ధరల సమస్య తారాస్థాయికి చేరడంతో చాలా తెలుగు సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ టీమ్స్ ఏం చేయబోతున్నాయి ? అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.పెద్ద నిర్మాతలు, పంపిణీదారులు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ రెండింటి విడుదల గురించి చర్చించడానికి అత్యవసరంగా సమావేశం అయ్యారని సమాచారం. ప్రమోషన్ల కోసం ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు వెనక్కి తగ్గితే భారీ నష్టం చవిచూడక తప్పదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్లతో పాటు అనేక సహ-బ్రాండెడ్ ప్రచారాలు జరుగుతున్నాయి. ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే మళ్లీ ఇదంతా చేయడం చాలా కష్టం. అయితే ఢిల్లీ కోసమే సినిమాను వాయిదా వేయడం జరగని పని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు కరోనా వ్యాప్తిని తగ్గించడానికి, రాబోయే నూతన సంవత్సర వేడుకల గురించి రాష్ట్రాలు అతిగా స్పందిస్తున్నాయని అభిప్రాయమా వ్యక్తం చేస్తున్నారు కొందరు. జనవరి 1వ వారంలో పెద్దగా కరోనా లేదా ఒమిక్రాన్ కేసుల సంఖ్యా పెరగక పోతే జనవరి 10 నాటికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. రాత్రి కర్ఫ్యూలు కూడా ఎత్తేసే అవకాశం ఉంటుంది. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.
ప్రమోషన్స్ లో రాధే శ్యామ్ :
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వింటెజ్ ప్రేమకథ చిత్రంగా వస్తున్న ఈమూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రభాస్ వెండితెరపై కనిపించబోతుండడంతో రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్ సినిమపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ కూడా ఒకటిఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా.. రాధేశ్యామ్ చిత్రయూనిట్.. తాజాగా రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్ ప్రారంభించింది. ఈ టూర్ ముందుగా వైజాగ్ నుంచి మొదలైంది. దీనికోసం చుట్టూ పోస్టర్స్‌తో ఉన్న ఒక వాహనాన్ని సిద్ధం చేశారు. ఇక ట్రైలర్ మాదిరిగానే దీనిని కూడా అభిమానులతో లాంచ్ చేయించారు మేకర్స్. ప్రభాస్ సినిమాకు సంబంధించిన ప్రతి మేజర్ విషయాన్ని అభిమానులతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రభాస్ అండ్ టీం.జనవరి 7 నుంచి ప్రభాస్‌తోపాటు రాధేశ్యామ్ చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో భాగం కానున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. దీనికోసం నేషనల్ మీడియాతో కూడా ప్రభాస్ మాట్లాడనున్నారు. భారీ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు రాధే శ్యామ్ టీం. దీనికి హీరో ప్రభాస్ కూడా తన 100% ఎఫర్ట్ పెడుతున్నారు. చిత్ర యూనిట్ కూడా ఇప్పటి నుంచి మీడియాకు ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కించారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మొదటి లవ్ స్టోరీ ఇది. యు.వి.క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.