YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కొలిక్కిరాని సమావేశం

కొలిక్కిరాని సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 29,
కేంద్ర జల్‌శక్తి శాఖ ఈ రోజు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల సీఎస్‌లతో వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. సీడ్ మనీ రూ.200 కోట్లను విడతల వారీగా ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు నెలలకొసారి చెల్లింపులు చేస్తామని ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ తక్షణమే అమలు చేయాలని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందిబచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను పక్కన పెట్టి తెలంగాణ నిర్ణయాలు తీసుకోవడం చట్ట వ్యతిరేకమైన చర్య అంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ ప్రకారం వివిధ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి మంజూరు చేసినందున కొత్తగా డీపీఆర్ లు అవసరం లేదని ఏపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరిపై తెలంగాణ రాష్ట్రం అక్రమంగా 7 ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ఫిర్యాదు చేసింది. వివిధ అంశాల పై రెండు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు ఉన్నందున ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందని కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు అజెండా అంశాలు సిద్ధం చేసిస్తే రెండు రాష్ట్రాల సీఎంలతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది.

Related Posts