YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

పట్టుబిగించిన భారత్

 పట్టుబిగించిన భారత్

ముంబై, డిసెంబర్ 29,
సెంచూరియాన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న మొదటి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే సఫారీలను కట్టడి చేసి భారీ ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా నాలుగో రోజు ఆటను కొనసాగిస్తోంది. ఈరోజు దాదాపు మూడు సెషన్లు భారత్ ఆడితే.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(4) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం శార్దూల్ ఠాకూర్(10) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. సఫారీ బౌలర్లలో రబాడా, జాన్సెన్ చెరో వికెట్ పడగొట్టారు.అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియాను ఎనిగిడి 6 వికెట్లు తీసి.. రబాడా 3 వికెట్లు తీసి వెన్ను విరిచాడు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్‌‌లో సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 197 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమి 5 వికెట్లు, శార్దుల్‌ 2 వికెట్లు, బుమ్రా, సిరాజ్‌, చెరో వికెట్ పడగొట్టారు.
భారత్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటీశ్వర్ పుజారా, అజింక్యా రహనే, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్(కెప్టెన్), మార్కరమ్, పీటర్సన్, డుస్సెన్, బవుమా, డికాక్(వికెట్ కీపర్), ముల్దర్, జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, ఎనిగిడి

Related Posts