YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కాకినాడ లో 14 ముగ్ద స్టోర్ గొప్ప ప్రారంభం

కాకినాడ లో 14  ముగ్ద స్టోర్ గొప్ప ప్రారంభం

టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌  ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం  ఇప్పుడు మన కాకినాడ చిక్కాల టవర్స్, టౌన్ హాల్ దగ్గర లో, మెయిన్ రోడ్ లో...
ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ....   ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను  కాకినాడ  నగర వాసులకు   అందుబాటులో కి వచ్చింది.  ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ, వైజాగ్ మరియు ఇపుడు కాకినాడ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను  అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ సందర్భంగా ముగ్ధ స్టోర్ నిర్వహకులు శశి వంగపల్లి మాట్లాడుతూ ‘‘  కాకినాడ  నా అభిమాన నగరాల్లో ఒకటి. మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్‌ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నాం. అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు   ఎందరో క్లయింట్స్‌ వస్తుంటారు. ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల.  ఈ నగరంలో  ముగ్ధ స్టోర్‌ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ కల ఇప్పటికి సాకారమైంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts