హైదరాబాద్ డిసెంబర్ 29
రాష్ట్రంలోని 19 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలన్నింట్లోనూ గెలిచి తీరాల్సిందేనని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు.ఆ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత నెలకొందిప్రజలంతా బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. తగిన కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయిలో ఉద్యమించండిఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ‘వర్క్ షాప్’లో బండి సంజయ్ వ్యాఖ్యలుఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి సమీక్ష నిర్వహించారు. కార్యాచరణపై లోతైన చర్చబీజేపీ అధికారంలోకి రావాలలంటే ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 19 ఎస్సీ నియోజకవర్గాలుండగా... ఆయా నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోందన్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆయా స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లు తేలిందన్నారు. అందులో భాగంగా ‘మిషన్-19’ పేరుతో 19కి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.ఈరోజు (28.12.2021) కత్రియా హోటల్ లో బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం ఈ వర్క్ షాప్ కొనసాగనుంది. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విజయ రామారావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, ఉఫాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై లోతుగా చర్చించారు.