YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

సరికొత్త ఆలోచనలో పోస్టల్ సేవలు

సరికొత్త ఆలోచనలో పోస్టల్ సేవలు

ముంబై, డిసెంబర్ 30,
పల్లెటూళ్ల, మారుమూల ప్రాంతాల వాసులు కరెంటు, నీరు, మొబైల్, డీటీహెచ్ బిల్లులు కట్టాలంటే సమీప పట్టణాలకు వెళ్లాల్సిందే. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ చార్జీలతోపాటు టైం వేస్టవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సరికొత్త ఆలోచన చేసింది. ఇంటి దగ్గరే బిల్లులు కట్టించే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆన్‌‌‌‌లైన్ పేమెంట్ ప్లాట్‌‌ఫామ్ భారత్ బిల్‌‌పే లిమిటెడ్‌‌తో చేతులు కలిపింది. బ్యాంకు సేవలు అందుబాటులో లేని ఐపీపీబీతోపాటు నాన్–-ఐపీపీబీ కస్టమర్లు తమ గడప దగ్గరే బిల్స్ చెల్లించవచ్చు. రీచార్జ్ చేయించుకోవచ్చు. పోస్టాఫీసు నెట్వర్క్ ఉన్న అన్ని ప్రాంతాలకూ డోర్‌‌స్టెప్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తారు. ఎన్సీపీఐ భారత్ బిల్‌‌పే ద్వారా  డీటీహెచ్, గ్యాస్, కరెంటు, లోన్ రీపేమెంట్, నీరు, కేబుల్ టీవీ సబ్‌‌స్క్రిప్షన్, మొబైల్ పోస్ట్‌‌పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జ్,  పురపాలక పన్నులు ఉన్నాయి.  బిల్లు చెల్లింపుల స్టేటస్ను ఆన్‌‌లైన్‌‌లో ట్రాక్ చేయవచ్చు. రిమైండర్లు పెట్టుకోవచ్చు. పేమెంట్స్ హిస్టరీని చూడవచ్చు. ఇప్పటికీ బ్యాంకు సదుపాయం లేని కస్టమర్ల కోసం, కంప్యూటర్ వాడకం తెలియని వారి కోసం భారత్ బిల్‌‌పే అందించే బ్యాంకింగ్ సేవలను ఇండియా పోస్ట్ అందుబాటులోకి తెస్తుంది.  డోర్‌‌స్టెప్ సర్వీసు కోసం కస్టమర్లు  155299 నంబరుకు కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ సెంటర్ 24×7 అందుబాటులో ఉంటుంది. ఫోన్వద్దనుకుంటే  గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), పోస్ట్‌‌మెన్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా అడ్హాక్ రిక్వెస్టును కూడా పంపొచ్చు.  రిక్వెస్టును పంపేటప్పుడే షెడ్యూల్ చేసిన రోజు నాటికి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగింటి మధ్య స్లాట్ తీసుకోవాలి. పోస్టాఫీసు నుండి సర్వీస్ డెలివరీ కిలోమీటరుకు మించి ఉన్నట్లయితే, ఒక్కో కస్టమర్‌‌కు  రూ. 20 ఫ్లాట్ ఛార్జీ (జీఎస్టీ మినహా) ఉంటుంది. ఐపీపీబీ అనేది 100 శాతం భారత ప్రభుత్వ సంస్థ.  భారత్ బిల్‌‌పే అక్టోబర్ 2021 నాటికి 60.62 మిలియన్లకు పైగా లావాదేవీలు నిర్వహించింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే కాబట్టి కస్టమర్ల డబ్బుకు ఢోకా ఉండదు.

Related Posts