YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా మద్యం సేల్స్

భారీగా మద్యం సేల్స్

హైదరాబాద్, డిసెంబర్ 30,
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న వైన్స్, బార్లు, పబ్‌లకు అర్ధరాత్రి వరకు అనుమతినివ్వడంతో భారీ ఎత్తున మద్యం డిపోల నుంచి తరలింది. వైన్ షాపులు భారీగా లిక్కర్‌ను కొనుగోలు చేస్తున్నాయి. తాజాగా మూడు రోజుల వ్యవధిలోనే రూ.482.4 కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు కొని వైన్ షాపులకు తరలించారు. ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) మద్యంతో పాటుగా బీరు కేసులు కూడా భారీగా కొంటున్నారు. ఈ నెల 27న 202.42 కోట్ల మద్యాన్ని డంప్ చేశారు. దీనిలో 2,36,601 కేసుల ఐఎంఎల్ మద్యం ఉండగా.. 2,06,314 బీర్ కేసులున్నాయి.ఇక 28న రూ.155.48 కోట్ల మద్యాన్ని వ్యాపారులు షాపులకు తరలించారు. తాజాగా బుధవారం రూ.124.5 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల్లో నుంచి తీసుకెళ్లారు. దీనిలో 1,30,650 లిక్కర్ కేసులు, 1,31,877 బీర్ కేసులున్నాయి. ఇక గత ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైన్ షాపులకు అమ్మకాల ద్వారా రూ.212 కోట్ల ఆదాయం వచ్చింది. అది ఈసారి రెండింతలయ్యే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.

Related Posts