YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లగడపాటి వారసుడు ఎంట్రీ..?

లగడపాటి వారసుడు ఎంట్రీ..?

విజయవాడ, డిసెంబర్ 30,
లగడపాటి రాజగోపాల్..రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. అసలు లగడపాటి అంటే మొదట గుర్తొచ్చేవి సర్వేలు, పెప్పర్ స్ప్రే. గతంలో విజయవాడ రాజకీయాల్లో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన లగడపాటి…ఎంపీగా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఎన్నికల సమయంలో తన సర్వేలతో ముందుకొచ్చేవారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పేవారు. 2014 వరకు లగడపాటి సర్వేలు సక్సెస్ అయ్యాయి. కానీ 2018 తెలంగాణ ఎన్నికలు, 2019 ఏపీ ఎన్నికల్లో లగడపాటి సర్వేలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయన ఇంకా సర్వేలు చేయనని చెప్పేశారు.ఇక సమైక్యాంధ్ర కోసం లగడపాటి ఏ విధంగా పోరాడారో అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన అప్పుడు పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి బాగా హడావిడి చేశారు. ఈ విధంగా లగడపాటి బాగా హైలైట్ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత లగడపాటి రాజకీయాలకు దూరం జరిగారు. ఇక ఇప్పుడు ఆయన వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. లగడపాటి తన వారసుడుని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారని తెలిసింది.
ఇదే క్రమమంలో లగడపాటి వారసుడు టీడీపీలో చేరనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. టీడీపీ సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతుంది. లగడపాటి వారసుడు టీడీపీలోకి వస్తున్నారని, అలాగే ఆయనకు గన్నవరం సీటు ఇస్తారని కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం గన్నవరంలో టీడీపీకి సరైన నాయకుడు లేరు. టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళడంతో గన్నవరంలో టీడీపీకి నాయకుడు లేరు.బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్‌గా పెట్టారు గానీ…ఆయన పెద్దగా ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. దీంతో ఇంచార్జ్‌ని మార్చాలని ఎప్పటినుంచో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధాని ఇంచార్జ్‌గా పెట్టాలని డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు లగడపాటి వారసుడుకు గన్నవరం సీటు ఫిక్స్ చేస్తారని ప్రచారం మొదలైంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Related Posts