హైదరాబాద్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. గురువారం అర్థరాత్రి నుంచి రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం భూపాలల్లి శాయిన్ పేట లో రచ్చబండ కార్యక్రమంలో రేవంత్ పాల్గొనడానికి సిద్దమయ్యారు. ఆ రచ్చబండ కు వెళ్లకుండా అర్థరాత్రి నుంచి గృహనిర్భందo చేసారు. మొన్న ఎర్రవెల్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కుండా హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి రేవంత్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. పీసీసీ అధ్యక్షుడు ప్రజల వద్దకు వెళ్లకుండా పోలీస్ లతో కట్టడి చేయడమెంటని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.