ముంబై, డిసెంబర్ 31,
కొత్త సంవత్సరంలో పసిడి ధరలు భగ్గుమనేలా కనిపిస్తోంది. దేశంలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం లేదు. బంగారం ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రతి రోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో బంగారం కొనుగోలు చేద్దామనే వారికి షాకివ్వనుంది. కరోనా కొత్త వేరియంట్ భయాందోళనలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, అమెరికా డాలర్ బలోపేతం వంటి తదితర అంశాల కారణంగా వచ్చే ఏడాది బంగారం ధర దాదాపు రూ.55వేల మార్క్ దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో 10 గ్రాముల బంగారం రూ.56,200లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.ఇక ఈ ఏడాదిలో కాస్త తగ్గుముఖం పట్టినా.. వచ్చే ఏడాది మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.48వేలకు చెరువలో ఉంది. అయితే ఈ ఏడాదిలో మదుపర్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ల మదుపునకు పరుగులు పెట్టడం కారణంగానే బంగారం ధర తగ్గుముఖం పట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఆరు నెలల్లో బంగారం పెరిగే అవకాశం ఉందంటున్నారు. వచ్చే సంవత్సరం బంగారం 10 గ్రాముల ధర రూ.51,800 నుంచి రూ.55,000 వరకు దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.