హైదరాబాద్, డిసెంబర్ 31,
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ ని కలిశారు. హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో సీఎంను రవీందర్ సింగ్ కలిశారు. సీఎం ఆహ్వనం మేరకు ప్రగతి భవన్ కు రవీందర్ సింగ్ వెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసి ఇటీవల జరిగిన పరిణామాలను సీఎంకు వివరించినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొని సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు రవీందర్ సింగ్ వెళ్లడి. రానున్న రోజులలో అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుందామని సీఎం హామీఇచ్చారన్న రవీందర్ సింగ్ వెల్లడించారు.అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి వ్యతిరేఖంగా రెబల్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్ల పోటీ చేశారు రవీందర్ సింగ్. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ ను విమర్శించారు. ఆ సమయంలో రవీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని జోరుగా వార్తలు వినిపించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కూడా రవీందర్ సింగ్ కు మద్దతు తెలిపింది. అయితే తాజా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మళ్లీ సొంత గూటికి చేరుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.