YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మూడు ముక్కలాటలో తెలంగాణ పార్టీలు

మూడు ముక్కలాటలో తెలంగాణ పార్టీలు

హైదరాబాద్, డిసెంబర్ 31,
తెలంగాణ రాజకీయాలలో మూడు ముక్కలాట సాగుతోంది. ఓ వంక అధికార తెరాస,అధికారాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరో వంక కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంపై పట్టు బిగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఓటమి పర్యవసానంగా తెరపై కొచ్చిన ‘వరి’ వివాదం, గత నెలరోజులకు పైగా రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేస్తోంది. ఏరోజుకారోజు కొత్త మలుపు తిరుగుతోంది. అయితే, వరి విషయంగా బీజేపీ, తెరాసల మది సాగుతున్న, సో ..కాల్డ్ ‘యుద్దం’ నిజం యుద్ధమా ? ఉత్తుత్తి పోరాటమా?  అంటే రెండోదే నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ, ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంపుగా బురద జల్లుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్లు, చీవాట్లు, శాపనార్ధాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు .. ఇలా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరి ‘పోరాట’ పటిమను వారు చూపుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో కారు, కమలం తప్పించి మూడో పార్టీ లేదనే  భ్రమలను సృష్టించేందుకు, రెండు పార్టీల నాయకులు  పొలిటికల్ డ్రామాను ఇంతవరకూ అద్భుతంగ రక్తి కట్టించారు. డమ్మీ ఫైట్’ని ఒరిజినల్ అనిపించేలా రెండు పార్టీల నాయకులు మహా నటులను మరిపించే విధంగా డ్రామాను పండించారు. అయితే, మొదటి నుంచి కూడా టీపీసీసీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రనిది అద్దంకి దయాకర్ ఇతర నాయకులు, ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న కమల దళం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ, ‘సంయుక్తం’ గా ఆడుతున్న నాటకమని, మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని చెపుతూనే ఉన్నారు. ‘నేను కొట్టి నట్టు చేస్తాను .. నువ్వు ఏడ్చి నట్లు చేయి’ అన్నట్లుగా ఢిల్లీ బాసులు, గల్లీ లీడర్లు కలిసి ఆడుతున్న దొంగ నాటకమని రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో ఆరోపించారు. అలాగే, రేవంత్ రెడ్డి సారధ్యంలో జనంలోకి దూసుకు పోతున్న కాంగ్రెస్ పార్టీని  నిర్వీర్యం చేసేందుకే, వరి వివాదం విషయంలో బీజేపీ తెరాస రాజకీయ  ‘జుగల్ బందీ’ నడిపించారని పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి  బీజేపీ, తెరాసల మధ్య ఫెవికాల్ సీక్రెట్ బంధం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే అంటున్నారు.ఇంతకాలం బీజేపీ,తెరాసల మధ్య ఉన్న చీకటి బంధం ఇప్పుడు ఓపెనైపోయింది  కేంద్ర ప్రభుత్వం వానా కాలం పంటను పూర్తిగా కొంటామని, లిఖితపూర్వకంగా లేఖ ఇస్తేనే కానీ, ఢిల్లీ వదిలేది లేదని ప్రగల్బాలు పలికిన మంత్రులు ... ఆ తర్వాత కొద్ది గంటలకే  ఎవరికీ చెప్పాపెట్టకుండా, తట్టాబుట్టా సర్దేశారు.అక్కడితోనే సగం డ్రామా తేలిపోయింది.ఇక ఆ తర్వాత బీజేపీని వెంటాడతాం, వేటాడటం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు తెరాస నాయకులు ఎవరూ కూడా వరి మాటే తీయలేదు. ఎత్తిన కత్తులను మడిచేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ‘ఫార్మర్’  హౌస్ ‘వరి’ గుట్టును బయట పెట్టడంతో కుక్కిన పేనులా ఉండి పోయారు’నిన్న మొన్నటి  వరకు వరి పేరున వీరంగం వేసిన బీజేపీ నాయకులు,  ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. ‘వరి’ సమస్యను పక్కన పెట్టి, నిరుద్యోగ సమస్యను తెరమీదకు తెచ్చారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ  చేయాలానే డిమాండ్’తో పార్టీ కార్యాలయంలో ఒక రోజు దీక్ష చేశారు. అలాగని నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయడం, సమస్య పరిష్కారం కోసం దీక్ష చేయడం తప్పని కాదు. కానీ, అందుకు ఎంచుకున్న సమయం మీదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఓ వంక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి  ఎర్రవల్లి ‘ఫార్మ్ హౌస్’  వద్ద వరి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్’తో రచ్చ బండ కార్యక్రమం నిర్వహిస్తున్న రోజునే బండి సంజయ్ దీక్ష చేయడం, వరి సమస్యను పక్కదారి పట్టించేందుకే అనుకోవలసి వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి రైతుల సమస్యల విషయంలో బీజేపీ, తెరాస మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. నిజానికి ఒక్క వరి  విషయంలోనే కాదు, ఇంకా అనేక  విషయాల్లో కూడా బీజేపీ, తెరాస రహస్య మిత్రులు అనేది  అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు అదే నిజం మరోమారు రుజువైంది .. అందుకే రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టేందుకు అ రెండు పార్టీలు ఒకటయ్యాయని అంటున్నారు

Related Posts