YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

హైవే లో చీకటి మాఫియా దాబాల మాటున ఆయిల్ విక్రయాలు

హైవే లో చీకటి మాఫియా దాబాల మాటున ఆయిల్  విక్రయాలు

జగ్గంపేట
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మం డలం...రామ వరానికి..బూరుగుపూడి కి మధ్యలో 16వ నెంబరు జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డా గా మారింది.అధికారుల కళ్లుగప్పి చీకటి వ్యాపారాలు సాగిస్తూ ఆయిల్,  విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. అధికారులు దాడులు జరుపుతూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులకు అడ్డుకట్ట పడటం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటకు కూతవేటు దూరంలో ఆయిల్ వ్యాపా రం జోరుగా సాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాపారం గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల లో కొనసాగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ మద్రాస్ కేరళ ఒడిశా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఈ రహదారి పై వాహనాలు నిత్యం రాకపో కలు సాగిస్తుండడం తో ఆయిల్ వ్యాపారానికి అనుకూలంగా మారింది. లారీలకు ఫ్యాక్టరీలకు  విక్రయాలు చేయడం ద్వారా అధిక రాబడి సాధిస్తున్నారు. అదే పెట్రోల్ బంక్ లో డిజిల్  లీటర్ రూ 95 ఉండ గా ఇక్కడ రూ 70  కి లీటర్ అమ్ముతున్నారు ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఇ అయిల్ మాఫిపియను ఆపాలని ప్రజాసంఘాలు డిమేండ్ చేస్తున్నాయి.

Related Posts