హిందూపురం
కేంద్ర ప్రభుత్వం వస్త్రాలు, గార్మెంట్ ల పై ఐదు శాతం నుంచి 12 శాతానికి జిఎస్టి పెంచడంతో వస్త్రం వ్యాపారులు దుకాణాలు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో క్లాత్ మర్చంట్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసి, వినూత్న రీతిలో డప్పులు కొట్టుకుంటూ పేట వెంకట రమణ స్వామి ఆలయం కూడలిలో ర్యాలీ చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా ప్రభావంతో వ్యాపారాలు లేక, కొంతమంది కనీసం దుకాణాలకు అద్దెలు చెల్లించలేక మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. మొదటి రెండవ విడత కరోనా ప్రభావంతో వ్యాపారం లేక బాడుగ అద్దెలకు డబ్బులు చెల్లించాలన్నారు ఇలాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఏడు శాతం అదనంగా జిఎస్టి పెంచడం వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐదు శాతం జీఎస్టీ ని ఉంచాలని డిమాండ్ చేశారు.