తిరుపతి
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు దూర ప్రాంతాల నుంచి నడిచివచ్చే భక్తులకు టిటిడి, శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని . బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. నాలుగు రోజులముందు అన్నమయ్య నడక మార్గంద్వారా నడిచివచ్చిన వేలాదిమంది భక్తులకు టీటీడీ దర్శనభాగ్యం కల్పిచింది. ఆదే విధంగా వీరికి కుడా దర్శనం కల్పించాలని అయన అన్నారు. ప్రతి ఏడాది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటారు. వీరందరికీ మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. వీఐపీలకు మొదటి ప్రాధాన్యత తగ్గించి, దూరప్రాంతాల నుంచి నడిచి వచ్చే భక్తులకు ప్రాధాన్యత పెంచాలని అయన అన్నారు.