నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఆయన వెంట మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డిల కూడా నల్లగొండ కు చేరుకున్నారు మంత్రులకు నల్గొండ బైపాస్ వద్ద భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పాలిటెక్నిక్ కాలేజీ లో నిర్మించిన ఎస్సీ ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించి అనంతరం 110 కోట్ల తో నిర్మిస్తున్న ఐటి హబ్కు శంకుస్థాపన చేసారు ఈ ఐటి హబ్ ద్వారా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి, రెండున్నర లక్షల చదరపు అడుగుల లో నిర్వహిస్తున్న ఐటీ హబ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది