YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

నుమాయిష్ కోసం ఏర్పాట్లు పూర్తి

నుమాయిష్ కోసం ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్
శనివారం నుంచి ప్రారంభం కానున్న నూమాయిష్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాడు నుమాయిష్ నిర్వహణపై  ఎక్సిబిషన్ సొసైటీ కమిటీతో ఫైర్, పోలీస్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు., సెంట్రల్ జోన్ ఇంఛార్జి డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ 1జనవరి నుంచి నాంపల్లిలో 81 వ ఇండస్ట్రియల్ ఎక్సజిబిషన్ ప్రారంభం కాబోతుంది. ఎక్సిబిషన్ కు ఫైర్, ఎలక్ట్రికల్, జీహెచ్ఎంసి, విద్యుత్ తదితర శాఖల అనుమతులు వచ్చాయి. నాంపల్లి ఏక్సిబిషన్ గ్రౌండ్ లో 100 హైడ్రింట్స్ , రెండు సంపులు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుతున్నాము. ప్రయివేటు సెక్యురిటి తో పాటు పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రతి స్టాల్లో 8కేజీల ఫైర్ రెడ్యుసింగ్ సీలిండర్ అందుబాటులో ఉంది. మైదానంలో ఎటువంటి వంట చేసేందుకు అనుమతి లేదని అన్నారు. నుమయిష్ వారం తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ అన్ని చర్యలు చేపడుతున్నారు. మెట్రో, ఆర్టీసీ ఎక్కువ సర్వీసులు నడపాలి అని కోరాం.కరోనా టెస్టింగ్, టీకా స్టాల్ డెస్కులు అందుబాటులో ఉంటాయి.
నుమయిష్  సెక్రెటరీ ఆదిత్య మాట్లాడుతూ టికెట్ ధరలు పెంచలేదు. ప్రతి స్టాల్ నిర్వాహకులు వ్యాక్సిన్ వేసుకోవాలి... లేదు అంటే గ్రౌండ్స్ లో వ్యాక్సిన్ స్టాల్స్ ఏర్పాటు చేసాము. అందరూ మాస్క్ లు, శానిటైజర్ లు  వాడాలి.   స్టాల్ నిర్వహకులకు, విజిటర్స్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసామని అన్నారు.

Related Posts