YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ట్రాఫిక్ సమస్యకు చెక్ పడేదెన్నడు

ట్రాఫిక్ సమస్యకు చెక్ పడేదెన్నడు

ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలోనే మరో ట్రాఫిక్ సమస్యను సృష్టించిన వైనం ఇది..ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాల్సిన ట్రాఫిక్ పోలీసులే సమస్యను సృష్టిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇది..రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న సమస్యను సృష్టించారని ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ అధికంగా క్రాస్ చేసే డివైడర్ల వద్ద కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నగరంలో ఎవి అప్పారావు రోడ్, జెఎన్ రోడ్డు, సెంట్రల్ జైల్ రోడ్‌లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ రోడ్లలో డివైడర్ వెంట్‌లను ట్రాఫిక్ పోలీసులు మూసి వేశారు. సాధారణంగా ఆర్ అండ్ బి డివైడర్లను ప్రమాణాల ప్రకారమే నిర్మిస్తుంది. ప్రధాన రోడ్లకు అనుసంధానంగా ఉన్న పక్క రోడ్లలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డివైడర్లు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి చోట్ల కూడా ట్రాఫిక్ పోలీసులు డివైడర్లను మూసి వేయడం వల్ల చుట్టూ తిరిగిరాలేని స్థితిలో రాంగ్ రూట్ ట్రాఫిక్ పెరిగిపోయింది. అడ్డదిడ్డంగా దాటేందుకు అవకాశం లేకుండా ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసమే చేసినప్పటికీ చాలా చోట్ల వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యంగా వుండటం వల్ల ప్రమాదాలు ఎదురవుతున్నాయి. నగరంలో రోడ్లలో పెద్దగా వేగంగా వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి వెసులుబాటు కల్పించాల్సిందిగా స్థానిక వాహనచోదకులు కోరుతున్నారువాస్తవానికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఈ విధానం సరైందే కావొచ్చు గానీ వాహన చోదకులు మరిన్ని ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి దాపురించిందని మాత్రం చెప్పొచ్చు. అసలు విషయమేమింటే రాజమహేంద్రవరం నగరంలో పలు రోడ్లలో డివైడర్ల వెంట్‌లను ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ట్రాఫిక్ గ్రిల్ గాడ్స్‌తో మూసివేశారు. దీంతో వాహన చోదకులు చుట్టూ దాదాపు అర కిలో మీటర్ మేర తిరిగి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి డివైడర్లను దాటుకుంటూ రావాల్సి వస్తోంది. అంతదూరం తిరిగి రాలేని స్థితిలో రాంగ్ రూట్‌లోనే వాహనాలకు ఎదురుగా రావడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయంలో కూడా ఇదే పరిస్థితిలో రాంగ్ రూటు ట్రాఫిక్ పెరిగిపోవడం బైక్‌లు ఢీకొట్టే ప్రమాదాలు తలెత్తుతున్నాయి. అనుబంధ రోడ్లలోంచి వచ్చిన వాహనాలు దాదాపు అర కిలోమీటర్ మేర తిరిగి వచ్చి డివైడర్‌ను దాటుకు రావాలంటే సమయంతోపాటు రద్దీలో ఇరుక్కునే పరిస్థితి ఎదురవుతోందంటున్నారు. ట్రాఫిక్ సమస్య లేని చోట కూడా ఈ విధంగా డివైడర్లను మూసి వేయడం వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతోందంటున్నారు. నిజంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అనువైన చోట వెంట్‌లను మూసి వేసినా, అవసరం లేని చోట మాత్రం వెంట్‌లను తొలగించాలని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో, మరో రూపంలో ట్రాఫిక్ సమస్యను సృష్టించవద్దని స్థానిక వాహన చోదకులు కోరుతున్నారు.

Related Posts