YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా ఆంధ్ర ప్రదేశ్

సినిమా... గందరగోళం ఏమిటీ..

సినిమా... గందరగోళం ఏమిటీ..

విజయవాడ, జనవరి 1,
సినిమా టిక్కెట్లపై వివాదమేంటి? దీని వెనుకున్న గందరగోళమేంటి? వినోదం పేరుతో జరుగుతున్న దోపిడీ ఎంత? సినిమా టిక్కెట్ నిర్ణయంలో అనుసరించాల్సి విధానమేంటి? తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం నియమించిన 13 మందితో కూడిన కమిటీ సమావేశమైంది. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వకమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తోంది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌ నేతృత్వంలో.. 13 మందితో కమిటీ నియమించింది ఏపీ ప్రభుత్వం.సినిమా టికెట్ల ధరలు ఎంత ఉండాలనే దానిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు నిర్ణయించింది. ఈ రేట్లకు మించి అమ్మితే థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. థియేటర్లలో సౌకర్యాలు, పార్కింగ్, అక్కడ విక్రయించే తినుబండారాల ధరలపైనా మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నింటికీ మించి కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి పలికింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35పై కొంతమంది థియేటర్ యజమానులు కోర్టుకెక్కారు. మరోవైపు టికెట్ రేట్ల తగ్గింపుపై కొంతమంది సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టికెట్ రేట్ల నిర్దారణపై కమిటీ వేసింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టికెట్ రేట్లలో మార్పు చేయనుంది.

Related Posts