YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మావోయిస్టల భారీ డంపు స్వాధీనం

మావోయిస్టల భారీ డంపు స్వాధీనం

విశాఖపట్నం
ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఏవోబీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్లలో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రీ దొరకడం ఇదే మొదటిసారి.  పోలీసులు స్వాధీనం చేసుకున్న డంప్లలో ఈ వారంలో ఇది రెండోదిపోలీసులకు అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా మల్కన్గిరి పోలీసులు మరియు బీఎస్ఎఫ్ బలగాలు గాలింపు చర్యలను కటాఫ్ ఏరియాలోని జొడొంబో పంచాయతీ పరిధిలోని అటవీప్రాంతంలో నిర్వహించారు.  జంత్రి పంచాయతీ పరిధిలోని తాబేరు మరియు అర్లింగపాడు గ్రామల సరిహద్దుల్లో అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. ఐఈడీ బాంబులతో  సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడినట్లు మల్కాన్ గిరి పోలీసులు పేర్కొన్నారు.ఇక్కడ ప్రధానంగా అక్రమ ఆయుధాల తయారీ, భారీ బాంబులు, మందుపాతరలను  లను మావోయిస్టులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రాబడిన సమాచారం మేరకు గాలింపులు చేపట్టగా ఈక్రమంలో ఈ భారీ డంప్ ను పోలీసులు గుర్తించారు. ఇందులో ఆరు ఐఈడీ టిఫిన్ బాంబులు, రెండు ప్రెషర్ ఐఈడీలు, కోడెక్స్ వైర్ ఒక మీటరు, 7.62 బాల్ ఆమ్యునేషన్లు రెండు, ఒక ఇన్సాస్ మ్యాగజైన్, ఒక ఐఈడీ మెకానిజం,ఒక జత బూట్లు, ఒక జత మావోయిస్టు యూనిఫాం, ఒక హావర్సాక్, ఒక కిట్ బ్యాగ్, ఒక 9 వోల్ట్ బ్యాటరీ, ఒక 3 వోల్ట్ బ్యాటరీ, మావోయిస్టు విప్లవ సాహిత్యం.. ఇతర సామాగ్రిని భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఆయుధాలు తయారు చేసేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఈ డంప్ ను మావోయిస్టులు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పేలుడు పదార్థాలను స్థానిక ప్రజలు, భద్రతా బలగాలపై ప్రయోగించేందుకు మావోయిస్టులు వ్యవహారచన చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈమధ్యకాలంలో మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించి భద్రత దళాలు ఛేదించిన అతిపెద్ద లక్ష్యం ఇదేనని మల్కాన్ గిరి పోలీసులు పేర్కొన్నారు.

Related Posts