విశాఖపట్నం
విశాఖలో గుట్టుగా నకిలీ కరెన్సీ చలా మణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ముఠా సభ్యుల నుంచి 7.2 లక్షలు నగదుతో పాటు 100,200,500 రూపాయల నకి లీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న రాజన్ విష్ణు,ఈశ్వర్ ఇద్దరు స్నేహితులు.ఎం వి పీ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ ని నిజమైన కరెన్సీ గా చెలామ ణి చేస్తూ ఉండగా పోలీసుల సమాచా రం అందింది.దీంతో పోలీసులు చేరు కొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా రు.రాజాన్ విష్ణుకు ఒడిశా లో దొంగ నోట్ల చలామణి చేసే వ్యక్తితో ఉన్న పరిచయంతో ఈశ్వర్ రావు నుండి 3లక్షల నిజమైన కరెన్సీ తీసుకున్నా రు.తన వద్ద ఉన్న 9 లక్షల నకిలీ కరెన్సీ తో పాటు మొత్తం 12 లక్ష లు సమకూర్చారు.ఇందులో 4 .7 లక్షలు మార్కెట్ లో నిజమైన కరెన్సీ గా చాలామణి చేశారు...మిగతా తన వద్ద ఉన్న నకిలీ కరెన్సీ ని చలామణి చేస్తూ ఉండగా పోలీసులకు పట్టు బడ్డారు. నిందితుల ఇద్దరిని రిమాండ్ కు తర లిం చారు..ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ద్వారక క్రైమ్ ఏ.సి.పి ఆర్.వి.వి.ఎస్.మూర్తి తెలిపారు.