జమ్మూ
జమ్మూ లోని మాత వైష్ణోదేవి ఆలయం లో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. నూతన ఏడాది పురస్కరించుకుని భక్తలు పెద్ద ఎత్తున ఆలయంలో పూజలు జరిపించడానికి వచ్చారు. క్షతగాత్రులను త్వరితగతిన ఆసుపత్రికి తరలించారు. కొంతమంది యువకుల మధ్య వివాదం చెలరేగడంలో ఈ ఘటన జరిగిందని అధికారులు నిర్దారించారు. ఘటనలో పన్నెండుమంది మృతి చెందారు. ౧౧ మందికి గాయాలయ్యాయిని ఏడీజీపీ ముఖేష్ సింగ్ వెల్లడించారు. పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితి ని అదుపులోకి తెచ్చామని అయన అన్నారు.
జమ్మూకశ్మీర్ వైష్ణోదేవీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.తొక్కిసలాటలో మృతులకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.కేంద్రం నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థికసాయాన్ని ప్రధాని ప్రకటించారు.జమ్మూకశ్మీర్: తొక్కిసలాట మృతులు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పును ఎక్స్గ్రేషియో ఇస్తున్నట్లు జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.