YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంచి చేయాలనుకోవడం తప్పా

మంచి చేయాలనుకోవడం తప్పా

గుంటూరు, జనవరి 1,
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన దాటుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో ఆయన వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ అవ్వాతాతలకు పించన్‌ను రూ. 2,500కు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తూ అర్హులైన వారందరికీ పెన్షన్ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. పేదలకు మంచి చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా అడ్డుపడ్డారని.. సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండేందుకు సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తే.. దానికి కూడా విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీఎస్ పధకం విషయంలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఇవాళ జరిగిన పించన్ల పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.‘పెన్షన్‌ రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం. సంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారు. అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నా.. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు ఉన్నారు. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఓటీఎస్‌ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారు. ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి చేస్తున్నామని’’ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

కేక్ కట్ చేసిన జగన్ :
నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేక్ కట్‌ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో కేక్‌ ఏర్పాటు చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంతో కేక్‌ కట్‌ చేయించారు.ముఖ్యమంత్రికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ప్రభుత్వ చీఫ్‌ అడ్వైజర్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్‌ ఆరోఖియా రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు, సీఎం స్పెషల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.హరికృష్ణ, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, ఇతర ఉన్నతాధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ తరపున సీఎంకి గవర్నర్‌ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరం సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎంకు అందించారు. దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Related Posts