YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామ బాటలో మరో రాముడు

రఘురామ బాటలో మరో రాముడు

నెల్లూరు, జనవరి 3,
ఏపీలో అధికార వైసీపీపై ప్రతిపక్షాలు ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీ ఎప్పుడు ఏదొక అంశంపై విమర్శలు చేస్తూనే ఉంటుంది. టీడీపీనే కాదు జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.అయితే ప్రతిపక్షాలే కాదు…వైసీపీ నుంచి గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం…తమ సొంత పార్టీపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. గత రెండేళ్లుగా ఢిల్లీలో ఉంటూ రచ్చబండ పేరిట..రఘురామ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా రెబల్‌గా మారిన రఘురామపై వైసీపీ కూడా ఎదురుదాడి చేస్తుంది. ఆయనకు చెక్ పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ చెక్ పెట్టడం సాధ్యం కావడం లేదు. మధ్యలో ఒకసారి అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారుగానీ…పెద్దగా అది కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ రఘురామ, వైసీపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు.రఘురామతోనే వైసీపీకి తలనొప్పి ఉంది అనుకుంటే ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డితో మరొక ఇబ్బంది వచ్చింది. మొదట్లోనే ఆనం…ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపారు. మొదట్లో అధికారులు సరిగగా పనిచేయడం లేదని, అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పైన బహిరంగంగానే విమర్శలు చేశారు. తాజాగా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుముఖం పట్టిందని, అయితే లోకల్‌ మాఫియా పేట్రేగిపోతోందని, లోకల్‌ మాఫియాతో కొందరు పోలీసులు చేతులు కలిపారంటూ పోలీస్‌ శాఖపై ఫైర్ అయ్యారు.ప్రజల్లో నమ్మకం భరోసా కల్పించాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతోందని అన్నారు. ఇలా ఆనం డైరక్ట్‌గా కామెంట్ చేయడంపై వైసీపీ పెద్దలఏమన్నా చర్యలు తీసుకుంటారా? లేక ఆయన్ని కూడా పార్టీ నుంచి సైడ్ చేసే కార్యక్రమం చేస్తారో చూడాలి. ఇప్పటికే ఆనంని సైడ్ చేసే కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది. కొందరు వైసీపీ పెద్దలు వెంకటగిరిలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. ఆనంని సైడ్ చేయడానికే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి వైసీపీలో ఆనం భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts