YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎందుకు కమలం డైవర్షన్

ఎందుకు కమలం డైవర్షన్

విజయవాడ, జనవరి 3,
ఏపీలో బీజేపీ పూర్తిగా తన వర్షన్ మార్చేసింది. ఇంతకాలం జగన్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లని బీజేపీ నేతలు సడన్‌గా స్వరం మార్చారు. జగన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కిపెట్టారు. ఇక జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ప్రజాగ్రహ సభ పేరిట సభ పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. అయితే ఇంతవరకు ఏపీ బీజేపీ నేతలు అంతగా వైసీపీపై విమర్శలు చేసిన సందర్భాలు తక్కువ ఉన్నాయి. ఏదో కొద్దిమంది నేతలు మినహా, మిగిలిన నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఏనాడూ విమర్శించలేదు.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం జగన్‌పై డైరక్ట్‌గా విమర్శలు చేయలేదు. కానీ ఇప్పుడు సోము కూడా దూకుడు పెంచారు. తాజా సభలో ఆయన కూడా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే పచ్చిసారా కాస్తూ.. రూ.3రూపాయల మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి విక్రయిస్తున్నారని, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70 చీప్ లిక్కర్ ఇస్తామని, ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తామని హామీ ఇచ్చారు.అటు కేంద్ర నేత ప్రకాశ్ జవడేకర్ సైతం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బెయిల్ మీద చాలామంది నేతలు తిరుగుతున్నారని, వారు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమని మాట్లాడారు. ఇక మిగిలిన నేతలు కూడా జగన్‌పై ఫైర్ అయ్యారు. అయితే బీజేపీ నేతలు విమర్శలు చూస్తుంటే…జగన్‌పై మరింత దూకుడుగా ముందుకెళ్లెలా ఉన్నారు. జైలు, బెయిల్ అని మాటలు బట్టి చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది. ఇంకా జగన్‌ని ఇరుకున పెట్టడానికి బీజేపీ సిద్ధమైందా? అనే డౌట్ వస్తుంది. రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని ఇంకా ఇరుకున పెట్టడానికి ట్రై చేస్తారేమో చూడాలి.

Related Posts