YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

2023 లోనే ఏపీ ఎన్నికలా...

2023 లోనే ఏపీ ఎన్నికలా...

ఒంగోలు, జనవరి 3,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ముందస్తు ఎన్నికలంటూ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ ఎన్నికలతో పాటే జగన్ ఎన్నికలకు వెళతారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సయితం తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? జగన్ కు తెలంగాణ ఎన్నికలతో పాటు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి జగన్ మరింత బలపడాలంటే 2024లోనే ఎన్నికలకు వెళ్లాలి. మోదీ ఇమేజ్ పెద్దగా లేదు. అందుకే పార్లమెంటు ఎన్నికలతో పాటు వెళ్లినా జగన్ కు కలిగే నష్టం ఉండదు. పైగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన జగన్ అభివృద్ధిపై ఈ రెండేళ్లు దృష్టి పెట్టాల్సి ఉంది. ఇక మూడు రాజధానుల అంశంపై కూడా స్పష్టత తీసుకురావాలంటే జగన్ కు ఏడాది సమయం సరిపోదు. న్యాయస్థానంలో నలుగుతుంది కాబట్టి ఎప్పుడు అవుతుందో చెప్పలేం. మూడు రాజధానులపై స్పష్టత ఇవ్వకుండా జగన్ ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి. ఐదేళ్ల పాటు ఏం చేశావన్న ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. పార్లమెంటు ఎన్నికలతో వెళితేనే జగన్ కు ఒకరకంగా లాభం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా 2024 ఎన్నికలయితేనే సేఫ్ అన్నది విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు, విపక్షాలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతాయని అంచనా వేస్తున్నారు. జగన్ కేసుల్లో తీర్పు త్వరగా వచ్చేస్తుందని, అందుకే త్వరగా జగన్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా వైఎస్ షర్మిల చికాకు కూడా ఉండదని భావిస్తున్నారట. అందుకే 2023లోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరుగా సాగుతుంది. కానీ వైసీపీ ముఖ్యనేతలు మాత్రం దానిని ప్రచారంగానే చూడాలని, 2024లోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.

Related Posts