YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి పెద్దిరెడ్డి

వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి పెద్దిరెడ్డి

చిత్తూరు
చిత్తూర్ జిల్లాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వ్యాక్సినేషన్ ప్రారంభించారు. తిరుపతి లోని 18వ వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కు అయనహాజరైయారు. మంత్రి ఆధ్వర్యంలో ఇద్దరికి వ్యాక్సినేషన్ వేసారు. 15 ఏళ్ల నుండి 18 ఏళ్ళ వయస్సు వారికి నేటి నుండి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇది. మంత్రి మాట్లాడుతూ చిత్తూర్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు 2.10 లక్షల మంది ఉన్నారు. అందరికి కోవాక్సిన్ అందుబాటులోకి తెచ్చాం. జిల్లాలో 1312 గ్రామ, వార్డు సచివాలయాల్లో, 141 పి.హెచ్.సి లలో వ్యాక్సినేషన్ అందిస్తున్నాం. మొత్తం 1453 కేంద్రాల్లో కి వెళ్ళి ఆ వయస్సు వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓమిక్రాన్ నేపథ్యంలో విద్యార్థులందరు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సినేషన్ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్యాధికారులని అభినందిస్తున్నాని అన్నారు.

Related Posts