హైదరాబాద్, జనవరి 3,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడింది.. అయితే, రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు ఇంకా అమలు కాలేదు. ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తున్నా.. పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది కేంద్రం..విభజన సమస్యలపై జనవరి 12వ తేదీన ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చింది… ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో.. హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.. మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలపై సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రం… సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను లేఖలో కోరింది.