YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ జనవరి 3,
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 7, 14న కాచిగూడ – విశాఖపట్నం, 8, 16వ తేదీన విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ – నర్సాపూర్‌, 12న నర్సాపూర్‌- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్‌ – లింగంపల్లి , 20, 22న లింగంపల్లి కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.కాచిగూడ – విశాఖపట్నం స్పెషల్‌ ట్రైన్‌: మల్కాజ్‌గిరి, చర్లపల్లి, కాజీపేట్‌, వరంగల్‌, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.కాచిగూడ – నర్సాపూర్‌ ట్రైన్: మల్కాజ్‌గిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, భీమవరం జంక్షన్‌, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.కాకినాడ టౌన్‌ – లింగంపల్లి ట్రైన్‌: సామర్లకోట, రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్‌ స్టేషన్లలో ఆగుతుందని రైల్వే ప్రకటనలో తెలిపింది.

Related Posts