YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిసి కెమెరాలను ప్రారంభించిన మంత్రి సబిత

సిసి కెమెరాలను ప్రారంభించిన మంత్రి సబిత

రంగారెడ్డి
మీర్పేట్ కార్పొరేషన్ లోని 16 డివిజన్ సాయి కృపా నగర్ లో సిసి కెమెరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. రేపటి నుండి తెలంగాణ వ్యాప్తంగా 15 నుంచి 18  సంవత్సరాల మధ్య వారికి కోవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుందని దానికి కాను కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి అన్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న కాలనీవాసులను,కార్పొరేటర్ ఏనుగు అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రి అభినందించారు. తెలంగాణలో 60 శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు ప్రతి సిసి కెమెరా ను అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది అని అన్నారు.  నేరం జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకునేందుకు,నేరాలు జరగకుండా ఉండేది అందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మంత్రి తెలిపారు. సి సి కెమెరాల వల్ల నేరాలు చేస్తే దొరికి పోతాము అనే భయం నేరస్తులలో కలుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ మేయర్,డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts