జగ్గయ్యపేట మండలం లోని గౌరవరం గ్రామపంచాయతీలొ విద్యార్థినీ విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. సర్పంచ్ ముత్తవరపు పావని, విజయవాడ పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు ముత్తవరపు వెంకటేష్ కార్యదర్శి బి. జగ్గయ్య ఏఎన్ఎంలు, వాలంటీర్లు ఉన్నారు .
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా గ్రామములోని అందరికీ మొదటి, సెకండ్ డోసులు ఇవ్వడం జరిగిందని ఈరోజు నుంచి విద్యార్థిని విద్యార్థులకు 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టినట్టు వెంకటేష్ తెలిపారు. కావున అందరూ ఈ ఉపయోగించుకొని కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.