YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అనుమతి లేదు..ఆరెస్టు చేసాం

అనుమతి లేదు..ఆరెస్టు చేసాం

కరీంనగర్
బండి సంజయ్ తో పాటు 16 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసామని కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణ అన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్  కింద కేసు, 332 333, 149, 147  సెక్షన్లు తో కేసులు నమోదయ్యాయి. ,  కో విడ్ నిబంధనల ఉల్లంఘన,  పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పలుమార్లు ఉల్లంఘనకు పాల్పడుతున్నారని హెచ్చరించామని అయన అన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించక పోగా పోలీసుల పై దాడి చేశారు. పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. బండి సంజయ్ దీక్షకు అనుమతి తీసుకోలేదు. కో విడ్ నేపథ్యంలో కేంద్రం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టమయిన ఆదేశలిచ్చాయి. పకడ్బందీగా అమలు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి.  నిన్ననే నోటీసు ఇచ్చాం. వందలాది మంది గుమిగూడారు. బండి సంజయ్ కు చెప్పాం, మాస్క్ లు సోషల్ డిస్టెన్స్ లేకుండా కోవిద్ నిబంధనలు పాటించలేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పోవడంతో అదుపులోకి తీసుకున్నాం. రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. 92 మందిని అరెస్టు చేసాం. విడుదల చేసాం. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్ ను కోర్టులో హాజరు పరిచామని అన్నారు.

నిర్మల్ లో బీజేపీ అందోళన :
 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నిన్న రాత్రి కరీంనగర్ లో అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో గల బిజెపి కార్యాలయం ఎదుట బిజెపి కార్యకర్తలు మూతికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన చేపట్టారు .ప్రభుత్వాన్ని నిద్ర నుంచి  మెల్కొల్పే  ఉద్దేశంతో  కరీంనగర్ లో జాగరణ దీక్ష చేపట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్ధరాత్రి డోర్లు బద్దలుకొట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ పట్టణంలోని బిజెపి కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తలు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు, ఈ సందర్బంగా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్ ను మరియు కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు .

బిజెపి నిరసనలు.. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం :
బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  చేపట్టిన జాగరణ దీక్షను భగ్నం చేసి, బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం తమ నాయకున్ని అక్రమ అరెస్ట్ చేయడం పిరికిపంధా చర్య గా అభివర్ణించారు. పార్టీ ఆఫీసులో చేస్తున్న దీక్షకు నానా రభస చేసి, గేట్లు బద్దలుకొట్టి బండి సంజయ్ ని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇకముందు ఇలాంటి హేయమైన చర్యలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Related Posts