YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూపీలో కమల వికాసం

యూపీలో కమల వికాసం

లక్నో, జనవరి 3,
దేశ రాజకీయాలను మలుపు తిప్పే రాష్ట్రం యూపీ. ఇక్కడ పాగా వేయాలని లోకల్‌ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. త్వరలో ఎలక్షన్‌ జరగనున్న యూపీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే దాదాపు కేంద్రంలో అధికారం సాధించినట్లేనని భావిస్తాయి జాతీయ పార్టీలు. అందుకే ఇక్కడ విజయం కోసం ఎప్పటినుంచో వ్యూహాలు మార్చుకుంటు ముందుకు సాగుతుంటాయి. అయితే అన్ని పార్టీలదీ ఒకటే టార్గెట్. UPలో అధికారంలోకి రావాలి. అందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇక్కడ గెలిచేందుకు అన్ని పార్టీలు మాస్టర్‌ ప్లాన్లతో ముందుకు కదులుతున్నాయి. అయితే గెలుపు ఎవరిది..? యూపీ ప్రజలు ఎటు వైపు ఉన్నారు..? ఎవరిని ఎన్నుకుంటారు..? ఎవరికి అధికారం అప్పగిస్తారు..? ఓటరు దేవుడి మనసులో ఏముందో కనిపెట్టే పనిలో పడ్డాయి సర్వే ఏజెన్సీలు. వారి సర్వేలు ఏం తేల్చనున్నాయి…? ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్.అతి త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా ఈజీగా విజయం సాధిస్తుందని వీటో సంస్థ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. మొత్తం 403 స్థానాలు ఉన్న అతిపెద్ద అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 230-249 సీట్లు వచ్చే అవకాశం ఉందని తాజాగా వారు నిర్వహించిన సర్వేలో తేలింది. ‘టైమ్స్‌ నౌ నవ్‌భారత్‌’ కోసం వీటో గత నెల 16 నుంచి 30 వరకు ఈ సర్వే చేపట్టింది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి 137 నుంచి 152 సీట్లు, బీఎస్పీ 9 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఈసారి కూడా ఫోర్త్ ప్లేస్‌కు పరిమితం అవుతుందని తెలిపింది.బీజేపీ నేతృత్వంలోకి కూటమికి ఈసారి 38.6 శాతం ఓట్లు రావొచ్చని వీటో సంస్థ చేపట్టిన తాజా సర్వేలో పేర్కొంది. 2017 కన్నా ఇది మూడు శాతం తక్కువ అని నొక్కి చెప్పింది. ఎస్పీకి 34.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని.. ఇక 2017లో 22.2 శాతం ఓట్లు పొందిన బీఎస్పీ మాత్రం ఈసారి 14.1 శాతంతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. బీఎస్పీ ఓట్లన్నీ ఎస్పీ లేదా బీజేపీకి షెఫిల్ అవుతాయని వెల్లడించింది.యూపీ ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పనులపై సానుకూల ధోరణి ఉండటం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా పేర్కొంది. ఇందులో ఇప్పటికే రామ మందిర నిర్మాణం మొదలు కావడం.. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ కూడా పూర్తి చేసుకుని అందుబాటులోకి రావడం యోగి సర్కార్‌కు కలిసి వచ్చే అంశం అని సర్వేలో అభిప్రాయ పడింది.కాగా బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన నేతగా రికార్డు సృష్టిస్తారు. 1985 నుంచి ఇప్పటి వరకు ఎవరూ వరుసగా ఈ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి కాలేదు.అయితే ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది BJP. మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది కాషాయ సేన. ఇందులో భాగంగానే ప్రాంతాల వారీగా అనుభవజ్ఞులైన ఇన్‌చార్జ్‌లను నియమించింది BJP.

Related Posts