YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భూమి కోసం ఎదురుచూపులు

భూమి కోసం ఎదురుచూపులు

పేద దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే సాగుభూముులు లేని పేద లబ్ధిదారులకు మూడు ఎకరాల భూమి అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని నిర్ణయించింది. అయితే అనేక చోట్ల భూ సేకరణ సమస్యగా మారడంతో ఈ పథకం నెమ్మదిగా సాగుతోంది. పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే సమస్యే నెలకొంది. నాలుగేళ్ల క్రితం సాగుభూములు లేని పేద దళితుల కుటుంబాలకు వ్యవసాయ భూమి కొనుగోలు చేసి పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 127.23 ఎకరాల భూమిని 45 కుటుంబాలకు  అందించారు. అధికారులు కొన్ని నెలలుగా ఒక్క ఎకరం కూడా కొనలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ భూములున్నాయి. ఇక భూములు ఉన్న ఆసాముల్లో పలువురు విదేశాల్లో స్థిరపడి వ్యవసాయక్షేత్రాలను కౌలుకు ఇచ్చారు. ఫలితంగా భూమిని కొనుగోలు చేసే వ్యవహారం ఇబ్బందిగా మారింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములు అందించేందుకు చాలామంది యజమానులు ఇష్టపడడంలేదు.  

 

రైతులకు మద్దతుగా సర్కార్ పలు పథకాలు అమలుచేస్తోంది. ఆర్ధిక చేయూతనూ ఇస్తోంది. పెట్టుబడి సాయం, ఎరువుల పంపిణీ, ఉచిత బీమా లాంటి పథకాలు పక్కాగా అమలు చేస్తోంది. దీంతో లక్షలాది రైతులు లబ్ధిపొందుతున్నారు. రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండడంతో దళిత రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాము కూడా వ్యవసాయం చేసుకుంటే సర్కార్ అన్ని విధాగా మద్దతుగా నిలుస్తుందని, ఫలితంగా పెద్దగా ఆర్ధిక భావం లేకుండానే సాగు చేసుకోవచ్చని ఆశిస్తున్నారు. ఇదిలాఉంటే లబ్ధిదారుల్లో చాలామందికి సొంతభూములు లేవు. దీంతో వారు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో దక్కడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి భూసేకరణ జరపాలని నిరుపేదలైన దళితులకు వ్యవసాయ భూమి అందించి ఆదుకోవాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారుల సమస్యను గ్రహించిన సర్కార్ మూడెకరాల భూమి పథకం సమర్ధవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుంటామని స్పష్టంచేసింది. దీని కోసం భూ సేకరణపై దృష్టి సారించింది. అయితే ధర వద్దే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 

Related Posts