శంషాబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి విదేశీ కరెన్సీ దొరికింది. హైదరాబాద్ నుండి షార్జా వెళ్ళేందుకు వచ్చిన మహమ్మద్ నజీర్ అనే వ్యక్తిని సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ నజీర్ ఎయిర్ అరేబియా విమానానికి టికెట్ బుక్ చేసుకుని షార్జా వెల్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన అతని బ్యాగేజ్ ను చెకింగ్ చేసిన సెక్యూరిటి ఆధికారులకు అక్రమంగా తరలిస్తున్న సౌది రియాల్ కట్టలు బయటపడ్డాయి. కరెరేన్సీని స్వాదీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీనిపై కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ కరెరేన్సీ విలువ 34.49 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.