సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్మన్ మంజూశ్రీ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సర్వ సభ్య సమావేశం మంగళవారం ప్రారంభమయింది. ఈ భేటీకి మంత్రి హరీష్ రావు, శాసన మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే లు గూడెం మహిపాల్ రెడ్డి, మానిక్ రావు, భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి తదితరులు హజరయ్యారు. ...కోవిడ్ ఉదృతంగా ఉన్న నేపథ్యం లో సభను తొందరగా ముగించాలని మంత్రి హరీష్ రావు జిల్లా పరిషత్ చైర్మన్ ను కోరారు. దాంతో వైద్య ఆరోగ్య శాఖ ఒక్క సబ్జెక్టు మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. సెకండ్ డోస్ వాక్సిన్ వేయడం లో ఎందుకు జాప్యం అయ్యిందంటూ వైద్యాధికారులు, అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా పై మంత్రి ప్రశ్నల వర్షం కురిపించారు. అసమగ్ర సమాచారం తో సమావేశానికి ఎలా వస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.