లక్నో, జనవరి 4,
కరోనా పడగ విప్పింది.. అయినా భయం లేదు.. నో ఫిజికల్ డిస్టెన్స్.. నో మాస్క్.. గుంపులు గుంపులుగా రోడ్డెక్కారు. ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టారు. ఇది కాస్తా తొక్కిసలాటగా మారింది. యూపీ బరేలీలో కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, మహిళలు ఈ మారథాన్‌లో పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టడంతో కింద పడిపోయారు. అయితే అందులోని విద్యార్థులకు స్వల్ప గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మహిళల మారథాన్’లో తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీ ‘లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్’ (నేను అమ్మాయిని, నేను పోరాడగలను) అంటూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది. ఈ కార్యక్రం కాస్తా రచ్చ రచ్చగా మారింది. ఈ కార్యక్రమానికి స్థానిక స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చారు. అయితే మారథాన్ మొదలవడంతో పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థినిలు ఒకరిపై మరొకరు పడిపోయారు.మారథాన్‌లో పరుగెత్తే సమయంలో అమ్మాయిలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో అంతా కింద పడిపోయారు. పాల్గొన్న వారిలో కొందరికి గాయాలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చాలా మంది చిన్నారులకు మాస్కులు లేకుండా కనిపించారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు కారణంగా మారుతోంది. చిన్న పిల్లలను ప్రచారంలో ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ కుట్ర అంటూ కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ సుప్రియా అరోన్ అసంబద్ధ ప్రకటన చేశారు. వైష్ణోదేవిలో తొక్కిసలాట జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ట్వీట్ చేశారు.ఒకవైపు ఒమిక్రాన్ విజృంభణతో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఎన్నికలు జరిగే ఆయా రాష్ట్రాల్లో ఖచ్చితంగా కొవిడ్ రూల్స్ పాటించాలని ఎన్నికల సంఘం కూడా తెలిపింది. కానీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు.