YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతి నిర్మాణాలపై ఫోకస్

అమరావతి నిర్మాణాలపై ఫోకస్

విజయవాడ, జనవరి 4,
మూడు రాజధానుల చట్టాన్ని తాత్కాలికంగా వెనక్కు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు సీఆర్డీఏ పరిధిలోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా.. ఆగిపోయిన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. నిధుల సమీకరణకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది సీఆర్డీఏ.మూడు రాజధానుల చట్టాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రస్తుతమున్న మూడు చట్టాలను రద్దు చేశామని.. తిరిగి సమగ్రంగా కొత్తగా తీసుకొస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాగే సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఆర్డీఏ పరిధిలోని చాలా కాలంగా పెండింగులో ఉన్న భవనాల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం ఏమేం భవనాలు పెండింగులో ఉన్నాయి..? అవి ఏయే పరిస్థితుల్లో ఆ బిల్డింగులు ఉన్నాయనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారం సేకరించింది.అయితే వీటిల్లో ప్రాధాన్యతల వారీగా ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని డిసైడైంది ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే హైకోర్టు అదనపు భవనం నిర్మాణం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన నిర్మాణం కూడా వీలైనంత త్వరగానే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికైతే నిర్మాణ పనులు ప్రారంభం కాకున్నప్పటికీ.. వీలైనంత త్వరగానే నిర్మాణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్టు సమాచారం. ఇప్పటికే విజయవాడ- గుంటూరు పరిధిలో నివాసముంటున్న హెచ్వోడీ, కమిషనర్లు, సెక్రటరీల హోదాల్లోని అఖిలభారత సర్వీసు అధికారులకు 40 వేల చొప్పున అద్దె భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. విభజన అనంతరం ప్రతీ నెలా ఇది ప్రభుత్వానికి భారంగానూ మారింది.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల భవన సముదాయాల నిర్మాణానికి సుమారు 730 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందనే అంచనాతో పనులు ప్రారంభించింది నాటి ప్రభుత్వం. ఈ నిర్మాణాలు దాదాపు 75 శాతం మేర పూర్తి అయినా.. ఇక ఫినిషింగ్, ఇంటిరీయర్స్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో ఆ రెండు భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నా.. అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కావాలన్నా.. పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయనే అంచనా వేసింది ప్రభుత్వం. దీనికి ఇప్పటికే 3 వేల కోట్ల రూపాయలతో డీపీఆర్ సిద్దం చేసింది సీఆర్డీఏ. ఈ మేరకు నిధుల సమీకరణ చర్యలను ప్రారంభించింది. నిధులు సమకూరితే.. ఓ ఆరేడు నెలల కాలంలో రెండు భవనాలను కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అప్పగించే అవకాశం కన్పిస్తోంది.

Related Posts