YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వనమా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

వనమా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

ఖమ్మం, జనవరి 4,
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో జరిగిన ముగ్గురు కుటుంసభ్యల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ మిస్టరీ ఆత్మహత్యలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నాయి. ఆత్మహత్యలకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు…వనమా రాఘవేంద్ర రావు, మా అమ్మ సూర్యవతి, మా అక్క మాధవి..ఈ ముగ్గురు నా చావుకు కారణం అంటూ రామకృష్ణ సూసైడ్ నోట్ లో రాశాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రామకృష్ణ. నిన్న రాజమండ్రి నుంచి పాల్వంచకు వచ్చి ఈ రోజు తెల్లవారుజామున తనతో పాటు భార్య పిల్లలపై పెట్రోల్ పోసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ జరిపాక అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామని చెబుతున్నారు.ఇదిలావుంటే, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఇంట్లో తనతో పాటు భార్య పిల్లలపై పెట్రోల్ పోసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తోంది. ఈ ఘటనలో మరో బాలికకు తీవ్ర గాయాలు కావటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ నవభారత్‌లో మీసేవా సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల డాడీస్ రోడ్ అనే యాప్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. అయితే, కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు స్థానికులు తెలిపారు.చేసిన వ్యాపారం కలిసి రాలేదు. అప్పు లేమో ఎక్కువయ్యాయి. సొంత ఆస్తులు అమ్మేసి తీరుద్దామనుకున్నాడు. కానీ అనుకున్నట్టు ఆస్తులు చేతికి రాలేదు. దీంతో రుణాలు తీర్చే మార్గం లేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇంట్లో గ్యాస్‌ లీక్‌ చేసి నిద్రపోతున్న భార్య, కూతుర్లతో పాటు తనపైనా పెట్రోల్‌ పోసుకొని నిప్పం టించుకున్నాడు. ఆ ప్రమాదంలో భార్యాభర్తలు, ఓ కూతురు కాలి ముద్దయ్యారు.మరో కూతురు పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో సోమవారం తెల్లవారు జామున ఈ విషాదం జరిగింది. తన చావుకు తన తల్లి సూర్యవతి, అక్క మాధవి, ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేందర్‌ రావే కారణమని రాసిన సూసైడ్‌ నోట్‌ బాధితుడి కారులో దొరికింది.
వ్యాపారాల్లో భారీ నష్టం
పట్టణంలోని పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ (38) గతంలో పాల్వంచలో మీ సేవా కేంద్రం నడిపించాడు. నష్టాలు వచ్చి మూసే శాడు. తర్వాత వైజాగ్‌లో మగ్గం వర్క్‌ వ్యాపారం చేసినా నష్టాలే వచ్చాయి. ఓ ఆన్‌లైన్‌ యాప్‌లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయినట్టు సమాచారం.సుమారు రూ.30 లక్షల మేర అప్పు అయినట్టు తెలుస్తోంది. వీటిని తీర్చేందుకు మరికొంత అప్పు కోసం స్థానికంగా పలువురిని సంప్రదించినా ఫలితం లేకపోవడం, ఇల్లు అమ్ముదామనుకున్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్థానికుల వద్ద వాపోయేవాడని తెలిసింది.తల్లి సూర్యవతి ఇటీవల కొత్తగూడెం ఆస్పత్రిలో పనిచేసి రిటైర్‌ కాగా.. ఆ వచ్చిన డబ్బు తనకిస్తే అప్పులు తీరుస్తానని రామకృష్ణ అడుగుతున్నాడు. అయితే ఆయన అక్క మాధవి ఆస్తిలో వాటా కోసం తల్లిని అడుగుతోందని, తనకు ఆస్తి దక్కకుండా చేస్తోందని మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. రామకృష్ణ–మాధవి మధ్య ఆస్తి తగాదా సెటిల్‌మెంట్‌కు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు, టీఆర్‌ఎస్‌ నేత రాఘవేందర్‌రావును సంప్రదించినట్టు సమాచారం.అయితే పాల్వంచలోని ఇంటితో పాటు గోకవరం, హైదరాబాద్, రాజమండ్రిల్లోని ఇళ్ల స్థలాల పంపకంలో అక్క మాధవి, తల్లికి అనుకూలంగా తీర్పు చెప్పి తనకు అన్యాయం చేశాడని రామకృష్ణ భావించినట్లు సమాచారం.
తల్లి బయటకు వచ్చి కేకలు వేయడంతో..
అప్పులు తీర్చు మార్గం లేక సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రామకృష్ణ తన ఇంట్లో గ్యాస్‌ లీక్‌ చేశాడు. తర్వాత నిద్రలో ఉన్న భార్య శ్రీలక్ష్మి (33), కవల కుమార్తెలు సాహిత్య (13), సాహితితో పాటు తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నాడు. మంటలు తాళలేక సాహితి కేకలేస్తూ ఇంటి తలుపు గడి తీసి బయటకు వచ్చి పడిపోయింది. పక్కనే మరో గదిలో తల్లి సూర్యవతి వెంటనే బయటకు వచ్చి పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు చేరుకున్నారు.ఫైర్‌ ఇంజన్, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్‌ ఇంజన్లు చేరుకుని మంటలను ఆర్పేశాయి. అప్పటికే నాగ రామకృష్ణ, ఆయన భార్య శ్రీ లక్ష్మి, సాహిత్య మంటల్లో పూర్తిగా కాలిపోయారు. పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ రాజు, సీఐ సత్యనారాయణ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని డాగ్‌ స్కాడ్, క్లూస్‌ టీమ్‌ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. శ్రీలక్ష్మి తమ్ముడు జనార్దన్‌ ఫిర్యాదు మేరకు రాఘవేందర్‌ రావు, తల్లి సూర్యవతి, అక్క మాధవిపైన, తనతో పాటు మరో ఇద్దరి మృతికి కారణమైన రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌ కలకలం రేపింది. తన చావుకు రాఘవేందర్‌ రావు, తల్లి సూర్యవతి, అక్క మాధవే కారణమంటూ నోట్‌లో పేర్కొన్నాడు. నోట్‌ను ఇంటి ముందు పార్క్‌ చేసిన కారులో పెట్టి స్నేహితుడికి వాట్సప్‌ ద్వారా విషయం చెప్పాడు. కారులోని సూసైడ్‌ నోట్‌ను ఏఎస్పీ రోహిత్‌ రాజు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 6 నెలలుగా ఏపీలోని రంపచోడవరంలో ఉంటున్న రామకృష్ణ ఇటీవలే పాల్వంచలోని ఇంటికి రాగా ఆయన భార్య శ్రీలక్ష్మి ఆదివారం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇంతలోనే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేందర్‌రావుపై ఇప్పటికే భూసెటిల్‌మెంట్లు, పైరవీల ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో చక్రం తిప్పుతారనే విమర్శలున్నాయి. గతంలో పాల్వంచ పట్టణానికి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తి తనకు చెందాల్సిన స్థలం రిజిస్ట్రేషన్‌ విషయంలో కొందరు అడ్డుపడుతున్నారని ఆత్మహత్య చేసుకొని సూసైడ్‌ నోట్‌ రాశారు. అందులో ఎమ్మెల్యే కొడుకు రాఘవేందర్‌రావు పేరు కూడా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అలాంటి ఘటనే మళ్లీ పునరావృతమైంది.మంటల్లో 80 శాతం కాలిన రామకృష్ణ కుమార్తె సాహితి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఏఎస్పీ రోహిత్‌ రాజు ఆమెతో మాట్లాడారు. తాము నిద్రలో ఉండగా తండ్రి పెట్రోల్‌ పోశాడని, వాసన రావడంతో లేచి చూడగా నిప్పంటించాడని, మంటలు తట్టుకోలేక తాను బయటకు వచ్చినట్టు సాహితి చెప్పిందని ఏఎస్పీ వెల్లడించారు.

Related Posts