హైదరాబాద్
సమైక్య పాలనలో దండగన్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కున్న రైతాంగాన్ని తిరిగి వ్యవసాయ రంగం వైపు మరలించారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలోని 63 లక్షల కుటుంబాలకు ఈ విడత రైతుబంధు సాయం అందుతున్నది. మొత్తం రాష్ట్ర జనాభాలో 2.50 కోట్ల జనాభా ప్రత్యక్ష్యంగా లబ్దిపొందుతున్నది. వ్యవసాయరంగం బలోపేతంతో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయింది. ఇది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించి ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుబంధు, రైతుభీమా, సాగునీటి పథకాలు, వ్యవసాయానికి ఉచిత కరంటు సరఫరా పథకాలకు ఎలాంటి ఆటంకాలు రానివ్వలేదు. వ్యవసాయ సంక్షోభానికి రైతుబంధు పథకం దారి, తెన్నూ చూపిందని అన్నారు.