YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ధర్డ్ వేవ్ సిగ్నల్స్ లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు

ధర్డ్ వేవ్ సిగ్నల్స్ లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు

ముంబై, జనవరి 5,
ఒక్కో స్టేట్ లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తోంది. 12 రాష్ట్రాల్లో నైట్‌క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ఢిల్లీ, బెంగాల్‌లో స్కూల్స్ క్లోజ్‌. మాల్స్‌, థియేట‌ర్స్‌, మెట్రోస్‌లో ఆంక్ష‌లు. ఓవైపు ఒమిక్రాన్ కేసులు.. మ‌రోవైపు పాత వేరియంట్ కేసులు.. అన్నీ క‌లిపి ఇండియాను కుదిపేస్తున్నాయి. దేశంలో కొవిడ్ మ‌హ‌మ్మారి.. మ‌ళ్లీ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. థ‌ర్డ్‌వేవ్ సిగ్న‌ల్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో 180 మందికి పైగా వైద్యులు కరోనా బారినపడటం కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో బెంగాల్‌లోని మూడు వేర్వేరు ఆస్పత్రులకు చెందిన 100 మందికి పైగా డాక్ట‌ర్లు కరోనా బారిన పడినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 70మంది వైద్యులు కలకత్తా జాతీయ వైద్య కళాశాల, ఆస్పత్రికి చెందినవారు కాగా.. 24మంది చిత్తరంజన్‌ సేవా సదన్‌కు చెందిన డాక్ట‌ర్లు.. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్తమాలజీకి చెందిన 12మంది వైద్యులకు కొవిడ్ సోకింది. వీరందరినీ క్వారంటైన్ చేశారు వైద్య‌శాఖ అధికారులు. ఆ డాక్ట‌ర్లు ప‌నిచేసే ఆసుప‌త్రిలో ప‌నిచేసే సిబ్బంది, చికిత్స పొందుతున్న రోగులంద‌రికీ కొవిడ్ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఇక‌, బిహార్‌లోని పట్నాలో నలంద మెడిక‌ల్ కాలేజ్ అండ్ హాస్పిట‌ల్‌కు చెందిన 87మంది వైద్యులను కరోనా కాటేసింది. బాధితుల్లో చాలా మందికి లక్షణాలు లేవ‌ని.. కొంద‌రుమాత్రం తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న‌ట్టు  తెలుస్తోంది. బాధిత వైద్యుల‌ను ఆస్పత్రిలోని క్యాంపస్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే, వారిలో ఐదుగురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల పట్నాలో జరిగిన భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) 96వ వార్షిక సదస్సుకు హాజరైనట్టు తెలుస్తోంది. గత వారం జరిగిన ఈ సదస్సుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్ కూడా హాజ‌ర‌వ‌డంతో అధికారులు సీఎంవోను అల‌ర్ట్ చేశారు.

Related Posts