YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు దేశానికే ఆద‌ర్శం కెసిఆర్ కి అండ‌గా నిల‌వండి ప‌ట్టా పాసు పుస్త‌కాలు-చెక్కులు పంపిణీ చేసిన వైద్య మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

రైతు బంధు దేశానికే ఆద‌ర్శం కెసిఆర్ కి అండ‌గా నిల‌వండి   ప‌ట్టా పాసు పుస్త‌కాలు-చెక్కులు పంపిణీ చేసిన వైద్య మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

రైతు బంధు ప‌థ‌కం దేశానికే ఆద‌ర్శం. దేశ రైతాంగ చ‌రిత్ర‌లో సువ‌ర్ణ‌క్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ప‌థ‌కం రైతు బంధు. రైతుని రాజుగా చూడ‌ట‌మే తెలంగాణ ప్ర‌భుత్వ ల‌క్ష్యం. ఆ ల‌క్ష్యాన్ని ముద్దాడే వ‌ర‌కు సీఎం కెసిఆర్ నిద్ర‌పోరు. అనుకున్న‌ది సాధించి, రైతుల క‌ళ్ళ‌ల్లో ఆనందం చూడ‌ట‌మే ఆయ‌న ఆశ‌యం. అందుకే దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతు బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించి రైతాంగానికి అండ‌గా నిలిచారు కెసిఆర్‌. అలాంటి సిఎం కెసిఆర్‌కి రైతాంగం, ప్ర‌జ‌లు అండ‌దండ‌గా నిలవాల‌ని పిలుపునిచ్చారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. జ‌డ్చ‌ర్ల నియోజ‌వ‌ర్గంలోని బాలాన‌గ‌ర్ మండ‌లం బోడ జానం పేట‌లో రైతు బంధు ప‌థ‌కం కింద రైతుల‌కు ప‌ట్టా పాసు పుస్త‌కాలు-చెక్కులు పంపిణీ చేశారు. 

 

ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, "స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్ళు దాటింది. పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లు వేశారు. రైతే రాజు అన్నారు. అన్న‌దాతే దేశానికి వెన్నెముక అన్నారు. కానీ రైతుని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. 40 ఏళ్ళు, ఆత‌ర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. ఆత‌ర్వాత టిడిపి, ఇత‌ర పార్టీలు పాలించాయి. కానీ, రైతాంగానికి ఒరిగిందేమీ లేదు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర లేదు. పండిన పంట‌ల‌కు గిడ్డంగులు లేవు. అప్పులు మిగిలి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టమే శ‌ర‌ణ్య‌మైంది" అన్నారు. అందుకే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మ‌న అదృష్టం కొద్దీ నాటి ఉద్య‌మ నాయ‌కుడు కెసిఆరే సీఎం అయ్యాడన్నారు. 

 

సిఎం కెసిఆర్ స్వ‌యంగా రైతు అయినందున రైతుల స‌మ‌స్య‌లు తెలిసిన వాడిగా రైతుని రాజుగా నిలిపేందుకే రైతు బంధు ప‌థ‌కాన్ని తెచ్చారు. రైతుల‌కు పంట పెట్టుబ‌డిని తానే ఓ పెద్ద‌న్న‌లా అందిస్తున్నాడు. ఎక‌రాకు రూ.4వేల చొప్పున‌, రెండు పంట‌ల‌కు అందిస్తున్నారు.ఇలా ఏడాదికి ఎక‌రాకు రూ.8వేలు అందుతాయి. ఇలాంటి ప‌థ‌కం దేశంలో ఎక్క‌డా లేదు. యావ‌త్ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా కెసిఆర్ తెలంగాణ‌లో అద్భుత ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వాల మాదిరిగా త‌మ ప్ర‌భుత్వం చెప్పేది కాద‌ని చేసి చూపించేద‌న్నారు. 

 

తెలంగాణ ప్ర‌భుత్వం అమలు చేస్తున్న ప‌థ‌కాలు ప్ర‌తిప‌క్షాలకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయ‌న్నారు. అందుకే కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ అడ్డ‌గోలు కేసులు వేస్తూ ఆయా ప‌థ‌కాల‌ను అడ్డుకుంటున్నాయిని మంత్రి విమ‌ర్శించారు. అయినా అభివృద్ధి ఆగ‌డం లేద‌న్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీల‌కు ఊళ్ళ‌కు రాకుండా త‌రిమి కొడితే రాష్ట్రం, దేశం బాగుప‌డ‌తుంద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

 

ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వ‌యోవృద్ధులు, వితంతువులు,  ఒంటరి మ‌హిళ‌లు, దివ్యాంగులు, బోద‌కాలు బాధితులు, బీడీ కార్మికులకు అందిస్తున్న‌ పెన్ష‌న్లు, భూ ప్ర‌క్షాళ‌న‌, గొర్రెలు, చేప‌ల‌ పంపిణీ,  చేనేత‌కు చేయూత‌, క‌ళ్యాణ లక్ష్మీ, షాదీ ముబార‌క్ వంటి అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అలాగే క‌ల్వ‌కుర్తి, బీమా, నెట్టెంపాడు, పాల‌మూరు, కాళేశ్వ‌రం వంటి అనేక ప్రాజెక్టులను, ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీరందించే మిష‌న్ భ‌గీర‌థ‌, ఊరుకు ఆదెరువైన చెరువుల బాగు చేస్తున్న మిష‌న్ కాక‌తీయ వంటి అనేక ప‌థ‌కాల‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు. 

 

ఇన్ని మంచి ప‌నులు చేస్తున్న సీఎం కెసిఆర్‌కి అండ‌గా నిల‌వాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి పిలుపునిచ్చారు. ప‌ని చేసే ప్ర‌భుత్వాల‌ను ఆద‌రించాల‌ని, అభివృద్ధికి అండ‌గా నిల‌వాల‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పాసు పుస్త‌కాలు, చెక్కులు పంపిణీ చేస్తూ వాటిని ఎలా డ‌బ్బులుగా మార్చుకోవాలో, బ్యాంకుల వ‌ద్ద ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాలో రైతాంగానికి మంత్రి వివ‌రించారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, స‌ర్పంచ్ వంటి స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, గ్రామ రైతులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు. 

Related Posts