రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. అ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఏపీ రాష్ట్ర విభజనకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. ఏపీ రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదని అయన అన్నారు. అయితే ఏపీ విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్కు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆ లేఖలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని గతంలో పలుమార్లు తాను స్థానిక టిడిపి నేతల దృష్టికి కూడ తీసుకెళ్ళానని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో టిడిపి తెగతెంపులు చేసుకొన్నందున పిటిషన్ దాఖలు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబునాయుడును ఆ లేఖలో కోరారు. తన పిటిషన్పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తే కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం దక్కుతోందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.