YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంపీలు..ఎమ్మెల్యేలుగా పోటీ..?

ఎంపీలు..ఎమ్మెల్యేలుగా పోటీ..?

హైదరాబాద్, జనవరి 5,
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, అంబర్‌పేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2019 ఎన్నికల్లో అదే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్కీ గా గెలిచారు. అనూహ్యంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అమిత్ షా సరసన స్థానం సంపాదించారు. అంతలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినేట్  స్థానం దక్కించుకున్న తొలి మంత్రిగా, ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతే కాదు,ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ నుంచి బీజేపీ సారధ్యంలోని  ఎన్డీఎ ప్రభుత్వాలలో కేబినేట్ హోదా పొందిన తొలి తెలుగోడుగా మరో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి 2019 లోక్ సభ ఎన్నికల్లో లక్కీ’ గెలిచింది ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే కాదు, బీజేపే రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధింగారు.అయితే ఈ లక్కీ’ ఎంపీలు అందరిలో కిషన్ రెడ్డి త్రీ ఫోర్  టైమ్స్ ఎక్కువ లక్కీ. అదలా ఉంటే’ ఓడి గెలిచిన ఎంపీలతో పాటుగా, బీజేపీ ఎంపీలు నలుగురిలో ముగ్గురు, కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు లేక లేక పోలేదని తెలుస్తోంది. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ కూటమి (కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్) మధ్యనే పోటీ జరిగింది. కానీ 2023 ఎన్నికలలో సత్తచాటేందుకు, కాంగ్రెస్’తో పాటుగా బీజేపీ కూడా గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే, తెరాస, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే, కాంగ్రెస్, బీజేపీ బలమైన నాయకుల అందరీని అసెంబ్లీ ఎన్నికల బరిలో దించేయాలని అలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని సమాచారం. కాంగ్రెస్‌లో ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మళ్ళీ  గత ఎన్నికల్లో పోటీచేసిన స్థానాల నుంచే తిరిగి ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. రేవంత్ కొడంగల్‌ నుంచి, నల్గొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి...హుజూర్‌నగర్‌ నుంచి, భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి...నల్గొండ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.  కేంద్ర మంత్రి  సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోతెచేసి ఓడిన అంబర్‌పేట నుంచి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ, గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిన కరీమానగర్ అసెంబ్లీ స్థానం నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు... గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతారు. అయితే బీజేపీ నాలుగో ఎంపీ (నిజామాబాద్) ధర్మపురి అరవింద్...మాత్రం మళ్ళీ లోక్ సభకే పోటీ చేస్తారని, పార్టీ వర్గాల సమాచారం. అయితే, ఎన్నికల సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి తుది నిర్ణయం ఉంటుదని అంటున్నారు.

Related Posts