ఒంగోలు
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్ తో కూడిన పావురం కలకలం రేపింది. కాలుకు కోడ్ తో కూడిన రబ్బర్ ట్యాగ్ చైనా పావురమంటూ ప్రచారం జరిగింది. ఇటీవల ఒడ్డిస్సా రాష్ట్రంలోని పలుప్రాంతాలైన కటక్, కేంధ్రపడ జిల్లా మార్ సగై పీఎస్ పరిధిలోని దశరథపుర్, పురి జిల్లా హరికృష్ణా పుర్ పంచాయితీలో రహంగిరియా లలో ఇదే తరహా పావురాలు దొరికాయి. అదే తరహాలో కోడ్ తో కూడిన పావురం స్థానికులకు చిక్కడంతో స్థానిక చీమకుర్తిలో కలకలం.ఒడ్డిస్సా రాష్టంలో పట్టుబడ్డ పావురాల కాలికి ఉన్న రబ్బర్ ట్యాగ్ పై వీహెచ్ ఎఫ్ వైజాగ్ 19742021 ముద్రించి ఉండటంతో అనుమానాలతో స్వాదీనం చేసుకున్న పోలీసులు.పురి జిల్లా హరికృష్ణా పుర్ పంచాయితీలో రహంగిరియా గ్రామస్థులకు గత సోమవారం చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్, మరోకాలికి 37 కోడ్ అంకెతో కూడిన ట్యాగ్ తో ఉన్న పావురాన్ని నిన్న స్వాదీనం చేసుకున్న పోలీసులు.అదే తరహాలో చీమకుర్తి నెహ్రూనగర్ లోని ఓ అపార్ట్ మెంట్లో నాగరాజు అనే స్థానికుడికి చిక్కిన పావురం కాలిపై రబ్బర్ ట్యాగ్ పై air అడ్డంగా 2019 నిలువుగా 2207 ఉన్న కోడ్స్.గత కొంతకాలంగా మిగతా పావురాలతో పాటు ఈ పావురం కూడా వస్తూపోతుండేదని..కాని కొత్తగా కాలికి ఏదో ట్యాగ్ ఉండటంతో దానిని పట్టుకోని పరిశీలించగా ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను పోలిఉండటంతో సమాచారాన్ని వీఆర్వో, పోలీసులకు అందించారు.