ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు, నోట్ల మార్పిడి కుంభకోణంలో ఆయన కుమారుడు లోకేష్ బాబు ఇద్దరు జైలుకు వెళ్లడం ఖాయమని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు పుత్తూరు పట్టణంలో బూత్ కమిటీ స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని తెలిపారు తన ఓటు నోటు కేసు కి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు తిరుపతిలో ధర్మ పోరాటం ధర్మ పోరాటం పేరుతో నిర్వహించిన సభలో నరేంద్ర మోడీని నిలదీశారని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఆర్కే రోజ తెలిపారు రాజధాని కోసం అలాగే రాష్ట్ర విభజన సంబంధించి హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు అర్థమవుతుందని రోజా దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అసహనంగా ఉన్నారని కనీసం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పలేక పోతున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకాల్లో పసిగట్టి ఓటుకు నోటు కేసులు వేగవంతం చేస్తున్నారని తెలిపారు చంద్రబాబు నాయుడుకు ఈ మధ్యకాలంలో మతిభ్రమించిందని ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని ఎమ్మెల్యే రోజా తెలిపారు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఏమిటీ కాయని అని మాట్లాడుతున్నారని రామాయణం రాసింది బ్రమరపోతాన అంటున్నారని, మరోసారి ఎవరైనా ఎస్సీలుగా పుడతారా అని మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజ ఎద్దేవా చేశారు అందుకే ఇలాంటి మతిస్థిమితం లేని ముఖ్యమంత్రిని దింపి ప్రజల బుద్ధి చెప్పాలని ఆమె తెలిపారు